నమస్తే శేరిలింగంపల్లి: ఏఐసీసీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పై అక్రమంగా ఈడి నోటీసులు పంపడాన్ని నిరసిస్తూ టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ శేరిలింగంపల్లి నియోజకవర్గం నాయకులు నిరసన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పార్టీ మాదాపూర్ డివిజన్ నాయకుల నాయకత్వంలో నెక్లెస్ రోడ్డులోని ఇందిరా గాంధీ విగ్రహం నుంచి ర్యాలీ ప్రదర్శన నిర్వహించారు. ఈడీ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు, రంగారెడ్డి ఎస్టీ సెల్ చైర్మన్ దేవావత్ సురేష్ నాయక్, కాంటెస్టెడ్ కార్పొరేటర్ డి. నగేష్, కిషన్ నాయక్, చాంద్ పాషా, లతీప్, ఇస్మాయిల్, జానీ తదితరులు ఉన్నారు.