నమస్తే శేరిలింగంపల్లి: పట్టణ ప్రగతిలో పరిసరాలను పరిశుభ్రం చేసుకుని ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయా డివిజన్ల కార్పొరేటర్లు పేర్కొన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని మాదాపూర్, హఫీజ్ పేట్, మియాపూర్, చందానగర్ డివిజన్లలో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించారు.
హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలో…
హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని మైత్రి నగర్ ఫేజ్ 2,3, ఉషోదయ ఎన్ క్లేవ్ కాలనీలలో, మాదాపూర్ డివిజన్ పరిధిలోని గుట్టల బేగంపేట బస్తీలో చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ పాల్గొన్నారు. పట్టణ ప్రగతి ద్వారా ఆయా కాలనీలలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, డ్రైనేజీ, మురికి కాలువలను శుభ్రం చేసుకుని సీజన్ వ్యాధులు రాకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో డీఈ సురేష్, ఏఈలు ప్రతాప్, వాటర్ వర్క్స్ డీజీఎం నాగప్రియ, మేనేజర్ మానస, ఎస్ ఆర్ పీ మహేష్, ఎంటమాలజీ సిబ్బంది, నాయకులు లక్ష్మారెడ్డి, విజయ్ భాస్కర్ రెడ్డి, కంది వెంకటేశ్వర రెడ్డి, మధుసూదన్ రెడ్డి, టి.నాగేశ్వర రావు, మైత్రి నగర్ ఫేస్-2 కాలనీ అధ్యక్షుడు సుబ్బా రావు, మైత్రి నగర్ ఫేజ్-3 కాలనీ అధ్యక్షుడు దయానంద్ రెడ్డి, రాంబాబు, ఎన్.పూర్ణ చందర్ రావు, డి. నరసింహ, డి.నాగేశ్వర, కృష్ణ మూర్తి, సామ్రాట్, శ్రీనివాస్ గౌడ్, నాగేశ్వర్ రావు, బాదరి నారాయణ రావు,ఏ.వి.ఎం రావు, మైసయ్య, రాంచందర్ రావు, సుబ్రహ్మణ్యేశ్వర్ రావు, రాంబాబు రెడ్డి, వసంత్ బాబు, సంజీవ, సి.వి రెడ్డి, రాజారావు, వీరభద్ర రావు, నారాయణ రెడ్డి, రత్నయ్య, జివివి సూర్యనారాయణ, రామ్మూర్తి, అంజనేయులు, ధీరజ్ కుమార్, కరుణాకర్, చంద్ర శేఖర్, ఎల్.ఎం చౌదరి, బాలరెడ్డి, వెంకటయ్య, సురేష్ మహిళలు విమల దేవి, సాయి జ్యోతి, మాదాపూర్ డివిజన్ నాయకులు రాజు ముదిరాజ్, ఎస్సీ సెల్ అధ్యక్షులు ఓ.కృష్ణ, అశోక్ గుప్త, లింగం గుప్త, వార్డు సభ్యులు రామచందర్, గుమ్మడి శ్రీనివాస్, శ్రీనివాస్, వీరేశం, సాయి కిరణ్, రాహుల్ తదితరులు పాల్గొన్నారు.
చందానగర్ డివిజన్ లో…
పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా చందానగర్ డివిజన్ లోని హుడా ఫేజ్ – 2, అర్జున్ రెడ్డి కాలని, డిఫేన్స్ కాలనీ, శుభోదయ కాలనీలలో పలు శాఖల అధికారులతో కలిసి చందానగర్ డివిజన్ కార్పోరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి పాదయాత్ర నిర్వహించారు. కాలనీలోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
పేరుకుపోయిన చెత్తను, నిర్మాణ వ్యర్థాలను శానిటేషన్ సిబ్బంది సహాయంతో తొలగింపజేశారు. వినాయక చవితి పండుగకు మట్టి వినాయకులను వినియోగించాలని కార్పోరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి కాలనీ వాసులకు సుచించారు. కాలనీ పార్కును అభివృద్ధి చేయాలని కాలనీ వాసులు కార్పోరేటర్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, వాటర్ వర్క్స్, జీహెచ్ఎంసీ అధికారులు, ఎలక్ట్రికల్, శానిటేషన్ విభాగం అధికారులతో పాటు వరలక్ష్మీ రెడ్డి, పులిపాటి నాగరాజు, వెంకటేష్, అక్బర్ ఖాన్, అంజాద్ పాషా, నరేందర్ భల్లా, దాస్ , హరీష్ రెడ్డి, కార్తిక్ గౌడ్, అల్తాఫ్, ఉదయ్, యశ్వంత్, సందీప్ రెడ్డి, అప్సర్, శ్రీనివాస్ నాయక్, రాజయ్య, సాయి తదితరులు పాల్గొన్నారు.
మియాపూర్ డివిజన్ లో…
మియాపూర్ డివిజన్ పరిధిలోని రెడ్డి కాలనీలో చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో జోనల్ కమిషనర్ శంకరయ్య, ఆయా శాఖల అధికారులతో కలిసి స్థానిక కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పాల్గొని పర్యటించారు. కాలనీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేలా కృషి చేస్తామని చెప్పారు. కాలనీల్లో ఉన్న చెత్తను తొలగింపజేశారు. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఈఈ శ్రీకాంతిని, ఏఎంహెచ్ఓ డాక్టర్ కార్తిక్, వాటర్ వర్క్స్ మేనేజర్ సాయిచరిత, ఏఈలు రామ్మోహన్, శివప్రసాద్, శానిటేషన్ శ్రీనివాస్, కాలనీ వాసులు కరిముల్ల, శ్రీకాంత్, భరత్ రెడ్డి, లక్ష్మీ నారాయణ, రాజు, బుచ్చయ్యచౌదరి, మురళి, భగీరధ రెడ్డి, రాజు, శానిటేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.