వివేకానంద నగర్ (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని పటేల్ కుంట పార్క్ లో కార్పొరేటర్ ఎం.లక్ష్మీబాయి, నాయకుడు మాధవరం రామారావు మంగళవారం పర్యటించారు. గత కొన్ని రోజులుగా భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా పార్కులో పెద్ద ఎత్తున వరద నీరు చేరింది. దీంతో పరిసర ప్రాంతాల్లోని వివేకానంద కాలనీ, ఈనాడు కాలనీల వాసులకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. విషయం తెలుసుకున్న కార్పొరేటర్ పర్యటించి పార్క్ మేనేజ్‌మెంట్, జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్ అధికారులు, వారి బృందంతో కలిసి వర్షపు నీటిని తొలగింపజేయించారు.

