
- పలు అవతారాల్లో భక్తులకు దర్శనమిస్తున్న అమ్మవార్లు
శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. అన్ని డివిజన్లలోనూ అమ్మవారి ఆలయాల్లో అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేస్తూ నిత్యం వారిని ప్రత్యేక అవతారాల్లో అలంకరిస్తున్నారు. కాగా శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని తారానగర్ తుల్జా భవాని అమ్మవారు మంగళవారం లక్ష్మీదేవి అవతారంలో దర్శనమిచ్చారు. కాగా కాంగ్రెస్ పార్టీ శేరిలింగంపల్లి ఇన్చార్జ్, యువజన కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.రవికుమార్ యాదవ్ తుల్జా భవాని అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ పాలక మండలి చైర్మన్ మల్లికార్జున శర్మ, సభ్యులు రేణుక శ్రీనివాస్ గౌడ్ అమ్మ వారి శేష వస్త్రం తో రవి కుమార్ యాదవ్ ఘనంగా సత్కరించారు. నెహ్రూ నగర్‌లో ఉన్న శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవి భక్తులకు అన్నపూర్ణ దేవిగా దర్శనమిచ్చారు. అదేవిధంగా హఫీజ్‌పేటలోని శాంతినగర్ పోచమ్మ అమ్మవారు భక్తులకు అన్నపూర్ణా దేవి అవతారంలో శాకంబరి అమ్మవారిగా దర్శనమిచ్చారు. ఈ సందర్బంగా అమ్మవార్లను భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.








