డీకే అరుణను క‌లిసిన శేరిలింగంపల్లి మ‌హిళ‌మోర్చా నాయ‌కురాళ్లు

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: భార‌తీయ జ‌న‌త పార్టీ మ‌హిళా మోర్చా శేరిలింగంపల్లి నియోజకవర్గం నాయ‌కురాళ్లు మంగ‌ళ‌వారం ఆ పార్టీ బిజెపి జాతీయ ఉపాధ్యక్షులు డీకే అరుణను మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లిసి ఘ‌నంగా స‌న్మానించారు. కాగా స్థానికంగా పార్టీ స్థితిగ‌తులు, ఎమ్మెల్సీ ఎన్నిక‌ల ప‌నితీరుపై డీకే అరుణ వారిని అడిగి తెలుసుకున్నారు. భ‌విష్య‌త్తులో రాష్ట్రంలో బిజెపి ప్ర‌భుత్వం ఖాయ‌మ‌ని, అందుకు అనుగుణంగా మ‌హిళ‌లు ముందుకు రావాల‌ని ఆమె పిలుపునిచ్చారు. డీకే అరుణ‌ను క‌లిసిన వారిలో వివేకానంద నగర్ డివిజన్ బీజేపీ ఇంచార్జ్ విద్యాకల్పనా ఏకాంత్ గౌడ్, అల్వీన్ కాలనీ మహిళా నాయకురాలు స్రవంతి, హైదర్ న‌గర్ మహిళా మోర్చా ప్రెసిడెంట్ లక్ష్మీ అన్నపూర్ణ, కొండాపూర్ మహిళామోర్చా ఉపాధ్య‌క్షురాలు వినీత సింగ్, శ్రుతీ శ్రీకాంత్ గౌడ్‌ త‌దిత‌రులు ఉన్నారు.

డీకే అరుణ‌ను స‌న్మానిస్తున్న విద్యాక‌ల్ప‌న ఏకాంత్ గౌడ్‌, స్ర‌వంతి, ల‌క్ష్మీ అన్న‌పూర్ణ‌, వినితా సింగ్‌, శ్రుతిగౌడ్‌లు

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here