మిరియాల ప్రీతమ్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు చీరల పంపిణీ

శేరిలింగంప‌ల్లి, మే 1 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం చందానగర్ డివిజన్ పరిధిలో మే డే సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులకు మిరియాల రాఘవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ట్రస్ట్ చైర్మన్ మిరియాల ప్రీతమ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ, సమాజ సేవలో ముందుండి పనిచేస్తున్న మిరియాల ప్రీతమ్ సేవలను అభినందించారు. టీపీసీసీ జనరల్ సెక్రటరీ, శేరిలింగంపల్లి అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్, ఎక్స్ కౌన్సిలర్ రవీందర్ రావు, కోఆర్డినేటర్ రఘునందన్ రెడ్డి, రవీందర్ రెడ్డి, అక్బర్ ఖాన్, అయాజ్ ఖాన్, హరి కిషన్, మోయిస్, ఉదయ్, రాజన్, శ్రీహరి, విష్ణుమూర్తి, వాసు, శాంత, నజియా, వరలక్ష్మి, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here