శేరిలింగంపల్లి, డిసెంబర్ 2 (నమస్తే శేరిలింగంపల్లి): లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ హఫీజ్‌పేట శాఖ అధ్యక్షుడు బాలింగ్ గౌతమ్ గౌడ్ ఆధ్వర్యంలో జిహెచ్ఎ సి మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు దుప్పట్లను పంపిణీ చేశారు. లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ అమర్నాథ్ రావు ముఖ్య అతిథిగా హాజరై దుప్పట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ విజయ్ లక్ష్మి, పద్మావతి, డిస్ట్రిక్ట్ క్యాబినెట్ జనరల్ మర్రి ప్రవీణ్, షిఫ్ట్ గవర్నర్ శ్రీనివాస్, జోన్ చైర్మన్ కృష్ణ గౌడ్, రీజనల్ చైర్మన్ రమణ, మాజీ కార్పొరేటర్ అశోక్ గౌడ్, రీజనల్ కోఆర్డినేటర్ లక్ష్మిరెడ్డి, కరుణాకర్ గౌడ్ , ఆనంద్ గౌడ్, నర్సింహా గౌడ్ , శ్రీనివాస్ గౌడ్, వెంకటేష్ గౌడ్, శంకర్ యాదవ్, శ్రీహరి గౌడ్, బాబు గౌడ్, మల్లేష్ పాల్గొన్నారు. డిస్ట్రిక్ట్ గవర్నర్ అధికారిక పర్యటనలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు బాలింగ్ గౌతమ్ గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా గౌతమ్ గౌడ్ చేస్తున్న సేవలను వారు కొనియాడారు.






