- ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ
హఫీజ్‌పేట (నమస్తే శేరిలింగంపల్లి): హఫీజ్‌పేట్ డివిజన్ పరిధిలోని సాయినగర్ కాలనీలో వరదల వల్ల దెబ్బ తిన్న కుటుంబాలకి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.10వేల ఆర్థిక సహాయాన్ని శుక్రవారం కార్పొరేటర్లు పూజిత, జగదీశ్వర్ గౌడ్‌లతో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరదల వల్ల దెబ్బతిన్న అన్ని కుటుంబాలకు సహాయం పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో అధికారులు డీఈ రూపాదేవి, డివిజన్ తెరాస అధ్యక్షుడు గౌతమ్ గౌడ్, తెరాస నాయకులు లక్ష్మారెడ్డి, సబీర్ పాల్గొన్నారు.