- చందానగర్ సర్కిల్ డీసీ, కార్పొరేటర్లతో సమీక్షా సమావేశం
మియాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ సర్కిల్ పరిధిలో పెండింగ్‌లో ఉన్న పనులను వెంటనే పూర్తి చేయాలని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పలు విభాగాలకు చెందిన అధికారులను ఆదేశించారు. మియాపూర్ డివిజన్ పరిధిలోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన గురువారం చందానగర్ సర్కిల్ డీసీ సుధాంష్, సర్కిల్ పరిధిలోని మాదాపూర్, మియాపూర్, హఫీజ్‌పేట్, చందానగర్ డివిజన్లకు చెందిన కార్పొరేటర్లు జగదీశ్వర్ గౌడ్, ఉప్పలపాటి శ్రీకాంత్, పూజిత గౌడ్, మంజుల రఘునాథ్ రెడ్డి, జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
సమీక్షా సమావేశంలో భాగంగా గాంధీ ఆయా డివిజన్లలో పెండింగ్‌లో ఉన్న పనులు, చేపట్టాల్సిన పనులు, సమస్యలు తదితర అంశాలపై చర్చించారు. అనంతరం గాంధీ మాట్లాడుతూ.. డివిజన్లలో నెలకొన్న సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజా ప్రతినిధులు, అధికారులు పనిచేయాలన్నారు. పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు మౌలిక వసతులను అందుబాటులోకి తేవాలన్నారు. పలు కాలనీల్లో తాగునీటి పైప్‌లైన్ల నిర్మాణ పనులు పూర్తయ్యాయని, కనుక రోడ్ల పనులు చేపట్టాలని అన్నారు. టెండర్లు పూర్తయిన పనులను వెంటనే ప్రారంభించి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని, వీధి దీపాలు వెలిగేలా చూడాలని, అవసరం అయిన చోట్ల వాటికి మరమ్మత్తులు చేయాలని అన్నారు. దీప్తిశ్రీనగర్ వద్ద కరెంటు స్తంభాలను తొలగించి వాటిని ఇంకో చోట ఏర్పాటు చేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో అధికారులు జీహెచ్ఎంసీ ఈఈ చిన్నా రెడ్డి, డీఈలు రూపాదేవి, సురేష్, ఏఈలు అనురాగ్, రమేష్, ప్రశాంత్, ప్రాజెక్టు ఏఈ శివ, వర్క్ ఇన్‌స్పెక్టర్ జగదీష్, స్ట్రీట్ లైట్ ఈఈ సంజయ్, డీఈ రామ్మోహన్, మియాపూర్ ఎలక్ట్రికల్ ఏఈ వెంకటేష్, 33 కేవీ లైన్ నవీన్ పాల్గొన్నారు.