వివేకానందనగర్ (నమస్తే శేరిలింగంపల్లి): పేదలకు సహాయం అందించేందుకు సీఎం రిలీఫ్ ఫండ్ ఎల్లవేళలా పనిచేస్తుందని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. వివేకానందనగర్ డివిజన్ పరిధిలోని వెంకటేశ్వరనగర్‌కు చెందిన మల్లయ్య అనే వ్యక్తి హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్‌కు దరఖాస్తు చేసుకోగా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన రూ.60వేల విలువైన ఎల్వోసీ పత్రాలను గురువారం మల్లయ్యకు గాంధీ అందజేశారు.
ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ ప్రజాక్షేమమే ప్రభుత్వ లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నిరంతరం పేదలకు సేవలను అందిస్తుందని తెలిపారు. ఆర్థిక స్థోమత లేక హాస్పిటళ్లలో చికిత్స పొందే బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా సహాయం అందిస్తామని తెలిపారు. ఎవరికైనా సమస్య ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో హఫీజ్‌పేట డివిజన్ తెరాస అధ్యక్షుడు బాలింగ్ గౌతం గౌడ్ పాల్గొన్నారు.