శేరిలింగంపల్లి, మే 18 (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ డివిజన్ పరిధిలోని వేమన రెడ్డి కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన Detailed Inch Architecture కార్యాలయాన్ని PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు, సీనియర్ నాయకుడు రఘునాథ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ యువ పారిశ్రామికవేత్తలు, సృజనాత్మక రంగాల్లో ముందుకు వస్తున్న సంస్థలు సమాజ అభివృద్ధికి దోహదపడతాయని పేర్కొన్నారు. ఆధునిక ఆర్కిటెక్చర్ సేవలను ప్రజలకు అందించేందుకు ప్రారంభించిన ఈ కార్యాలయం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మంత్రిపగడ సత్యనారాయణ, ఓ. వెంకటేష్, రామరాజు, ప్రభాకర్ రెడ్డి, నగేష్, సురేష్ నాయక్, నరేందర్ బల్లా, రమణా రెడ్డి, రాజేందర్, బాబు తదితరులు పాల్గొన్నారు.






