శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): డివిజన్ టిఆర్ఎస్ సీనియర్ నాయకుడు కలివేముల వీరేశం గౌడ్ సోమవారం శాసనసభ ఉపసభాపతి టి.పద్మారావు గౌడ్ ను వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. పద్మారావు గౌడ్ కు పూలమొక్కను అందజేసి విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన వీరేశం గౌడ్ రానున్న గ్రేటర్ ఎన్నికల్లో శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఏదైనా ఒక డివిజన్ నుంచి తనకు కార్పొరేటర్ గా అవకాశం కల్పించాలని కోరారు. దివంగత నేత కొండకల్ శంకర్ గౌడ్ స్ఫూర్తితో శేరిలింగంపల్లిలో దశాబ్ధకాలంగా రాజకీయాలలో కొనసాగుతున్నానని, అన్ని వర్గాల ప్రజలతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నానని అన్నరు. యువతను ఏకంచేసి సేవా కార్యక్రమాలలో భాగస్వామ్యం చేస్తున్న తనకు కార్పొరేటర్ గా అవకాశం కల్పిస్తే భారీ మెజారిటీతో విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కె.సత్యనారాయణ గౌడ్, ఎన్.సంతోష్ రెడ్డి, కె.పాండు గౌడ్, కె.సంతోష్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.






