హఫీజ్ పేట్ (నమస్తే శేరిలింగంపల్లి): హఫీజ్ పేట్ డివిజన్ బిజెపి కార్యకర్త, ఆ పార్టీ రాష్ట్ర నాయకులు మొవ్వ సత్యనారాయణ వ్యక్తిగత కార్యదర్శి హరినాథ్ మృతి చెందారు. వారం రోజుల క్రితం బ్రెయిన్ స్ట్రోక్ కు గురైన హరినాథ్ ను మదినగూడ శ్రీకర దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. వనపర్తి జిల్లా పెబ్బేరుకు చెందిన హరినాథ్ మూడు దశాబ్దాల క్రితం నగరానికి వలస వచ్చి గంగారం గ్రామంలో స్థిరపడ్డాడు. ఆయనకు భార్య, ఒక కూతురు, కుమారుడు ఉన్నారు. హరినాథ్ మృతి పట్ల శేరిలింగంపల్లికి చెందిన వివిద పార్టిల నాయకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అన్నా పార్ధీవదేహానికి నివాళులు అర్పించిన నాయకులు వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తంచేశారు. కాగా మంగళవారం వారి స్వగ్రామం పెబ్బేరులో హరినాథ్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.






