గచ్చిబౌలి (నమస్తే శేరిలింగంపల్లి): దసరా పండుగ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీకి నేతాజీనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు భేరి రామచందర్ యాదవ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా మండలి ఉపాధ్యక్షురాలు కుమారి, పద్మమ్మ, విద్యావతి, విజయ కాలనీ ఉపాధ్యక్షులు ఎండీ కమర్ పాషా, టీ కుమార్ ముదిరాజ్, రాగం జంగయ్య యాదవ్, కాలనీ పెద్దలు, మహిళా సంఘం నాయకులు పాల్గొన్నారు. అనంతరం భేరి రామచందర్ యాదవ్ గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబాకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.







