శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 11 (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ సర్కిల్ పరిధిలో డిప్యూటీ కమిషనర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. చందానగర్ సర్కిల్ పరిధిలోని హెల్త్, శానిటేషన్ AMOH, SS, SFAలు, SRPలు, Sanitary Jawan, Ramky వారితో ఈ సమావేశం నిర్వహించారు. రహదారులను, కాలనీలను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచాలని అన్నారు. రోడ్లపై చెత్త వేయకుండా ప్రజలకు అవగాహన కల్పించాల్నారు. అన్నపూర్ణ క్యాంటీన్ చుట్టు పక్కల శుభ్రంగా ఉండేట్లు చూడాలని సూచించారు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెత్తను తొలగించాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, ఖాళీ డబ్బాలను తొలగించాలని అన్నారు.






