శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 11 (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ సర్కిల్ పరిధిలో డిప్యూటీ కమిషనర్ అధ్యక్షతన రెవెన్యూ డిపార్ట్మెంట్, అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్, ట్యాక్స్ ఇన్స్పెక్టర్స్, బిల్ కలెక్టర్లతో ప్రాపర్టీ టాక్స్ విషయాలపై సమావేశం నిర్వహించారు. చందానగర్ సర్కిల్ పరిధిలోని అన్ని షాపులకు ట్రేడ్ లైసెన్స్ ఇచ్చి సకాలంలో పన్నులు చెల్లించేలా చూడాలని సూచించారు. ప్రాపర్టీ టాక్స్ సకాలంలో చెల్లించని వారికి నోటీసులు ఇవ్వాలని అన్నారు.






