శేరిలింగంపల్లి, డిసెంబర్ 22 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని BK ఎన్‌క్లేవ్ కాలనీలో ఉన్న రాక్ చర్చిలో మియాపూర్ డివిజన్ కు చెందిన పాస్టర్లతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశం లో మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ ముఖ్యఅతిథిగా పాల్గొని క్రిస్మస్ కేక్ ను కట్ చేసి క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ… బీకే ఎన్‌క్లేవ్ కాలనీలోని రాక్ చర్చిలో వివిధ చర్చిల పాస్టర్ల తో ఆత్మీయ సమావేశం కావడం జరిగిందని, సర్వ మతాలను సమానంగా తమ ప్రభుత్వం చూస్తుందని ఆయన అన్నారు. క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించుకునేందుకు వివిధ చర్చిల పాస్టర్స్ తమకు ఉన్న సమస్యలను తమ దృష్టికి తీసుకు రావడం జరిగిందని, పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ సహకారంతో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కార్పొరేటర్ శ్రీకాంత్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో మియాపూర్ డివిజన్ కు చెందిన పాస్టర్లు స్వామి, సాల్మన్ రాజు, ప్రశాంత్ రాణి, బాలరాజు, సుకుమార్, ఫిలిప్, విజయ్ కుమార్, బెంజమిన్, ఝాన్ సామ్యూల్, విల్సన్, తండా విజయ్ కుమార్, రామోజీ నాయక్, జి ఫిలిప్, సువార్త రాజు, డేవిడ్, జాన్ రాజు, ఇజ్రాయెల్, శేఖర్, సత్యవతి తదితరులు పాల్గొన్నారు.





