చిన్నారులకు అక్షరాభ్యాసాలు చేయించిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

శేరిలింగంప‌ల్లి, జ‌న‌వ‌రి 23 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి డివిజన్ తారానగర్ సన్ షైన్ గ్లోబల్ స్కూల్ చైర్మ‌న్ పవన్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన వసంత పంచమి మహోత్సవంలో శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సరస్వతీ పూజలో పాల్గొని ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులకు పలకలు, బలపాలు పంపిణీ చేశారు. చిన్నారులకు అక్షరాభ్యాసం తన ఒడిలో చిన్నారిని కూర్చోబెట్టుకుని చేశారు. కార్పొరేటర్ మాట్లాడుతూ.. చదువుల తల్లి జ్ఞాన స్వరూపిణి శ్రీ సరస్వతి దేవి కరుణకటాక్షాలతో ప్రతిఒక్కరూ జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రాధికా, పురం విష్ణువర్ధన్ రెడ్డి, సన్ షైన్ స్కూల్ టీచర్స్ చిన్మయి, ఉషా, వాణి, సరిత, రాధికా, నీరజ, రమాదేవి విద్యార్థులు, తల్లితండ్రులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here