హైమాస్ లైట్స్ ను ప్రారంభించిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

శేరిలింగంప‌ల్లి, న‌వంబ‌ర్ 13 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి డివిజన్ లో ఏర్పాటు చేస్తున్న హైమాస్ లైట్స్ తో డివిజన్ మరింత సుందరంగా మారుతోందని కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అన్నారు. ఇందులో భాగంగానే శేరిలింగంపల్లి డివిజన్ లోని హుడా ట్రేడ్ సెంటర్ పార్క్ లో నూతనంగా ఏర్పాటు చేసిన హైమాస్ లైట్స్ ను కాలనీ సీనియర్ సిటిజన్స్ తో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ప్రారంభించారు. కార్పొరేటర్ మాట్లాడుతూ ముఖ్యంగా ఉదయం, సాయంత్రం స‌మ‌యంలో సీనియర్ సిటిజన్స్, స్థానికవాసులు వాకింగ్, వ్యాయామం ద్వారా దేహదారుఢ్యాన్ని పెంపొందించుకుంటార‌ని, వారిని దృష్టిలో పెట్టుకుని హుడా ట్రేడ్ సెంటర్ పార్క్ లో సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ ను ప్రారంభించ‌డం జరిగిందని తెలిపారు. మౌలిక సదుపాయాలలో భాగంగా హైమాస్ లైట్స్​‍ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

నూతన హైమాస్ లైట్స్​‍ ఏర్పాటుతో హెచ్‌టీసీ పార్క్ విద్యుత్‌ కాంతులతో సరికొత్త శోభను సంతరించుకుందన్నారు. కాలనీ సమస్యలపై స్థానికవాసులను అడిగి తెలుసుకున్నారు. ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకువస్తే సంబంధిత అధికారులను ఆదేశించి సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. హైమాస్ లైట్లు ఏర్పాటు చేయడానికి ప్రత్యేక చొరవ చూపిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ కి స్థానికవాసులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ గౌరవ అధ్యక్షుడు వీరేశం గౌడ్, హుడా ట్రేడ్ సెంటర్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జయంత్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ కాశీ విశ్వనాధం, జనరల్ సెక్రటరీ నర్సింహా రావు, ట్రెజరర్ వేణు మోహన్ రావు, జాయింట్ సెక్రటరీ పాండు రంగయ్య, బుచ్చి రెడ్డి, నరసింహ రెడ్డి, లక్ష్మణ్, పురం విష్ణువర్ధన్ రెడ్డి, వేణు మోహన్ రావు, గోపి యాదవ్, సుబ్బారావు, సుధాకర్, కవి, భాస్కర్, మనోహర్ రావు, జివి రావు, సత్యనారాయణ మూర్తి, శర్మ కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here