శేరిలింగంపల్లి, డిసెంబర్ 31 (నమస్తే శేరిలింగంపల్లి): క్రిస్మస్ ను పురస్కరించుకొని శేరిలింగంపల్లి డివిజన్ పాస్టర్స్ ఫెలోషిప్ అసోసియేషన్ సభ్యులను కార్పొరేటర్ కార్యాలయానికి ఆహ్వానించి ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాస్టర్లు కార్పొరేటర్ ని ఉద్దేశించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేసి ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. కార్పొరేటర్ పాస్టర్లను శాలువా కప్పి సత్కరించారు. కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రైస్తవులను దృష్టిలో పెట్టుకొని చర్చిల అభివృద్ధికి పాటుపడుతూ సహకరించినందుకు హర్షం వ్యక్తం చేశారు. అందులో భాగంగా తన వంతు సహాయంగా ప్రతి ఏడాది లాగే పాస్టర్లకు కానుక అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిషప్ దానియిల్ దోనే, పాస్టర్ శ్యాంబాబు, పాస్టర్ జెర్మీయా, పాస్టర్ వందనం, పాస్టర్ నోబుల్ నిర్మల్ కుమార్, ప్రధాన కార్యదర్శి రవీందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.






