శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ శనివారం పాపిరెడ్డి కాలనీలో ఇంటింటికి తిరుగుతూ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. పాదయాత్రలో కాలనీ వాసులు అధిక సంఖ్యలో పాల్గొని ఆయనకు పూలమాలలు వేసి శాలువాలతో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో చేసిన వాగ్దానాల అమలుకు తప్ప కుండా పాటు పడతానని ఉద్ఘాటించారు. మంచినీటి సమస్య, డ్రైనేజీ, రోడ్ల సమస్యల పరిష్కారం కోసం శాయశక్తులా కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. కాలనీలో ఎలాంటి సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు శ్రీకళ, రాంబాబు, కొండల్ రెడ్డి, రమేష్, కనకలక్ష్మి, కృష్ణ, శ్రీను, కనకయ్య, భాగ్య, చంద్రకళ, సుజాత, రేణుక, సారమ్మ, సదా, బసవయ్య, రోజా, కళ్యాణి, శ్రీను, శ్రీలత, నసిమ, కుమరి, సుధారాణి పాల్గొన్నారు.







