హఫీజ్‌పేట (నమస్తే శేరిలింగంపల్లి): పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ నమోదు ప్రక్రియ మొదలైందని, హఫీజ్ పేట్, మాదాపూర్ డివిజన్ల పరిధిలోని పట్టభద్రులు అందరూ తప్పక ఓటర్ నమోదు చేసుకోవాలని కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని శాంతి నగర్ బస్తీలో స్థానికులతో కలిసి ఆయన పాదయాత్ర నిర్వహించారు. నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులను పరిశీలించారు. అనంతరం బస్తీలో ఉన్న పట్టభద్రులు ఓటర్ నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జెరిపాటి రాజు, సుధాకర్, సాదిక్, మౌలానా, హనీఫ్, అక్బర్ తదితరులు పాల్గొన్నారు.