శేరిలింగంపల్లి, ఏప్రిల్ 21 (నమస్తే శేరిలింగంపల్లి): వాటర్ బోర్డు జనరల్ మేనేజర్ బి. బ్రిజేష్ ని కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ హఫీజ్‌పేట్ లో వాటర్ డిపార్ట్మెంట్ కార్యాలయం లో కలసి కొండాపూర్ డివిజన్ పరిధిలోని పలు సమస్యల గురించి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ వినతిపత్రంలో ముఖ్యంగా గచ్చిబౌలి వడ్డరబస్తీ (రాజీవ్ నగర్)లో మరొక వాటర్ బూస్టర్ ఏర్పాటు చెయ్యాలని కోరారు. అంజయ్య నగర్, సిద్దిక్ నగర్, ప్రేమ్ నగర్ బస్తిలలో వాటర్ సప్లై పై పలు రకాల ఫిర్యాదులు రావటం జరుగుతున్నదని, వాటిపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిందిగా కోరారు. అవసరం అయితే వాటర్ సప్లై పై ప్రత్యేక కార్యాచరణ కార్యక్రమం రూపొందించాలని అధికారులను కార్పొరేటర్ హమీద్ పటేల్ కోరారు. వేసవి కాలంలో బస్తిలలో, కాలనీలలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి మంచి నీటి కొరత రాకుండా సిబ్బందికి ప్రత్యేక సూచనలు, ఆదేశాలు జారీ చెయ్యాలని అన్నారు. ఈ సమావేశంలో జీఏం బ్రిజేష్, డిజీఏం శరత్ కుమార్ రెడ్డి, నరేందర్ రెడ్డి, మేనేజర్ విక్రమ్ రెడ్డి, అభిషేక్ రెడ్డి పాల్గొన్నారు.