శేరిలింగంపల్లి, ఆగస్టు 15 (నమస్తే శేరిలింగంపల్లి): 79వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకొని కొండాపూర్ డివిజన్ పరిధిలోని పలు కాలనీలు, బస్తీలలో డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ స్థానిక నాయకులు, ప్రజలు, కార్యకర్తలతో కలసి జాతీయ జెండాను ఎగురవేసి గౌరవ వందనం చేశారు. ప్రేమ్ నగర్ ఏ బ్లాక్, ప్రేమ్ నగర్ బీ బ్లాక్, హనీఫ్ కాలనీ, మార్తాండ్ నగర్, రాజా రాజేశ్వరి నగర్, అంజయ్య నగర్, సిద్దిక్ నగర్, బంజారా నగర్, ఓల్డ్ పీజేఆర్ నగర్, న్యూ పీజేఆర్ నగర్ లలో ముఖ్య అతిధిగా పాల్గొని కార్పొరేటర్ హమీద్ పటేల్ జాతీయ జెండాలను ఎగుర వేశారు. ప్రతి ఒక్కరికి 79వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో సీనియర్ నాయకులు, నాయకురాళ్లు, ప్రజలు, కాలనీవాసులు, ఆయా అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.






