శేరిలింగంపల్లి, ఆగస్టు 15 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ఆవరణలో 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జరిగిన జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో కార్పొరేటర్లు ఉప్పలపాటి శ్రీకాంత్, మంజుల రఘునాథ్ రెడ్డి, నార్నె శ్రీనివాసరావులతో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి జెండావందనం సమర్పించారు. 79 వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్బంగా PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ భారత జాతి స్వేచ్ఛా వాయువులు పీల్చుకునేందుకు పోరాడిన త్యాగధనులందరికీ జోహార్లు అర్పిస్తున్నట్లు తెలిపారు. ప్రజాభివృద్దే కేంద్ర బిందువుగా, ప్రజా సమస్యల శాశ్వత పరిష్కారం దిశగా సీఎం రేవంత్ రెడ్డి సుపరిపాలన సాగిస్తున్నారు అని అన్నారు. అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే దక్కుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు, మాజీ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు, కాలనీ ల అసోసియేషన్ సభ్యులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.






