స్వాతంత్య్ర‌ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

శేరిలింగంప‌ల్లి, ఆగ‌స్టు 15 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): 79వ భారత స్వాతంత్య్ర‌ దినోత్సవం పురస్కరించుకొని శేరిలింగంపల్లి జిహెచ్ఎంసి కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ హేమంత్ బొర్ఖడే, శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్, కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్, బిజెపి రాష్ట్ర నాయకుడు కసి రెడ్డి భాస్కర్ రెడ్డి, జిహెచ్ఎంసి తదితర సంబంధిత అధికారులతో కలిసి గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మ‌హాత్మ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేశారు. అనంతరం గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి జిహెచ్ఎంసి అధికారులకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి, డిఈలు, ఏఈలు, జిహెచ్ఎంసి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here