శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 18 (నమస్తే శేరిలింగంపల్లి): కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ ఎంపి గడ్డం రంజిత్ రెడ్డి జన్మదిన సందర్భంగా ఆల్విన్ కాలనీ డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్, యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్ డివిజన్ తరపు నుండి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలతో కలిసి తరలివెళ్లి రంజిత్ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాలతో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.






