మ‌హిళ అంత్య‌క్రియ‌ల‌కు కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ఆర్థిక సహాయం

ఆల్విన్ కాల‌నీ‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): అనారోగ్యంతో మృతి చెందిన మహిళ అంత్యక్రియలకు కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ఆర్థిక సహాయం అందజేశారు. ఆల్విన్ కాలనీ డివిజన్ ప‌రిధిలోని ఎల్లమ్మబండ మొగలమ్మ కాలనీకి‌ చెందిన పుల్లమ్మ అనారోగ్యంతో మంగ‌ళ‌వారం మృతి చెందింది. ఈ విషయం తెలుసుకున్న కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంత‌రం ఆమె కుటుంబ స‌భ్యుల‌కు ఆమె అంత్యక్రియల నిమిత్తం రూ.5వేల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో యువ నాయకుడు రామకృష్ణ గౌడ్, బీసీ సంక్షేమ సంఘం డివిజన్ అధ్యక్షుడు రాజేష్ చంద్ర, పాస్టర్ శామ్యుల్ పాల్గొన్నారు.

మ‌హిళ కుటుంబానికి రూ.5వేలు అంద‌జేస్తున్న కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here