చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ డివిజన్ పరిధిలోని దీప్తి శ్రీ నగర్ కాలనీలో రూ.20 లక్షల జీహెచ్ఎంసీ నిధులతో కొనసాగుతున్న సీసీ రోడ్డు పనులను కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ.. కాలనీలో రోడ్లపై గుంతలు పడినందున వాహనదారులకు ఇబ్బందిగా ఉందని కాలనీవాసులు విజ్ఞప్తి చేశారని, అందుకనే సీసీ రోడ్డును నిర్మిస్తున్నామని తెలిపారు. పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు రోడ్డును అందుబాటులోకి తేవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబర్ రమణ కుమారి, గౌస్, వర్క్ ఇన్‌స్పెక్టర్ జగదీష్ తదితరులు పాల్గొన్నారు.
ఇందిరానగర్ బస్తీలో కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి పర్యటన…
చందానగర్ డివిజన్ పరిధిలోని ఇందిరానగర్ బస్తీలో కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి శనివారం పర్యటించారు. స్తానికంగా డ్రైనేజీ, తాగునీరు సమస్యలు ఉన్నాయని కాలనీవాసులు కోరడంతో ఆమె పర్యటించి సమస్యలను పరిశీలించారు. ఈ సందర్భంగా బస్తీవాసులు మాట్లాడుతూ.. తాగునీరు ప్రెషర్ సరిగ్గా రావడం లేదని, బస్తీలో కొత్త డ్రైనేజీ లైన్ నిర్మాణం చేపట్టాలని అన్నారు. ఇందుకు స్పందించిన కార్పొరేటర్ నవత రెడ్డి మాట్లాడుతూ.. అన్ని సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని తెలిపారు. ఆమె వెంట రాధిక, గౌస్, మల్లేష్, బస్తీ వాసులు ఉన్నారు.