సీసీ రోడ్డును ప‌రిశీలించిన కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి

చందాన‌గ‌ర్‌‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): చందానగర్ డివిజన్ ప‌రిధిలోని భవానీశంకర్ నగర్ కాలనీలో రూ.10 లక్షల జీహెచ్ఎంసీ నిధులతో నిర్మించిన సీసీ రోడ్డును కాలనీ వాసులతో కలసి కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి గురువారం పరిశీలించారు. ఈ సంద‌ర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ.. ర‌హ‌దారులపై గుంత‌లు ప‌డినందున‌, కాల‌నీవాసుల ఫిర్యాదు మేర‌కు సీసీ రోడ్డును నిర్మించ‌డం జ‌రిగింద‌ని తెలిపారు. ప్ర‌జ‌ల‌కు ఏ స‌మ‌స్య ఉన్నా వెంట‌నే ప‌రిష్క‌రించేందుకు కృషి చేస్తామ‌ని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు ఎస్.ఎస్ రావు, రమేష్, చందర్ రావు, రామారావు పాల్గొన్నారు.

నూత‌నంగా నిర్మించిన సీసీ రోడ్డును ప‌రిశీలిస్తున్న కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here