- కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి
చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ డివిజన్ పరిధిలోని గంగారం, దీప్తి శ్రీ నగర్ ల వద్ద రూ.4 లక్షల జీహెచ్ఎంసీ నిధులతో నిర్మించిన బస్ షెల్టర్లను కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ప్రయాణికుల సౌకర్యమే ప్రభుత్య ధ్యేయం అని, ప్రయాణం చేసే వారికి ఇబ్బంది లేకుండా బస్ షెల్టర్లను నిర్మించడం జరిగిందని, మహానగరాన్ని విశ్వనగరంగా అభివృద్ధి చేస్తున్నామని, ప్రయాణికుల సౌకర్యార్థం బస్ షెల్టర్లను నిర్మించడం జరిగిందిని తెలిపారు. బస్సుల కోసం వేచి చూసే ప్రయాణీకులకు నీడ కల్పించాలనే సదుద్దేశంతో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు జీహెచ్ఎంసీ తరపున హైదరాబాద్ నగరంలో పెద్ద ఎత్తున బస్ షెల్టర్లను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. బస్ షెల్టర్ ఆవరణలో స్వచ్చ టాయిలెట్లను కూడా ఏర్పాటు చేశామని, బస్ షెల్టర్ల ఏర్పాటుతో ప్రయాణికులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈ సురేష్, వార్డ్ మెంబర్ రమణ కుమారి, త్రినాథ్, గౌస్, మొయిజ్, జగదీష్ ఠాకూర్ పాల్గొన్నారు.