మియాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్లోని టీఎస్ఆర్టీసీ డిపో-1 నుంచి కొరియర్, కార్గో పార్సిల్ సర్వీసులు కూడా ప్రజలకు అందుబాటులో ఉన్నాయని డిపో మేనేజర్ వెంకటేశం ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే డిపో నుంచి విజయవాడ, కాకినాడ, మైసూర్, బెంగళూరు, విశాఖపట్నం, పోలవరం, భద్రాచలం తదితర సుదూర ప్రాంతాలకు ఉదయం 4.30 నుంచి రాత్రి 10 గంటల వరకు రాజధాని, గరుడ ప్లస్, సూపర్ లగ్జరీ బస్సులను నడిపిస్తున్నామని తెలిపారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.






