లాఠీచార్జీని నిరసిస్తూ గాంధీ విగ్రహానికి వినతి పత్రం సమర్పించిన కాంగ్రెస్ నేతలు

నమస్తే శేరిలింగంపల్లి: విద్యార్థి నిరుద్యోగ సైరన్ ర్యాలీలో‌ కాంగ్రెస్ నాయకులపై జరిగిన పోలోసుల లాఠీ చార్జీ, అరెస్టులను నిరసిస్తూ చందానగర్ గాంధీ విగ్రహం ఎదుట శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులు నిరసన తెలిపారు. ఈ మేరకు‌ అహింసవాది మహాత్మ‌ గాంధీ జయంతి రోజున టీఆర్ఎస్ ప్రభుత్వ హింసాత్మక చర్యలను వ్యతిరేకిస్తూ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. టీఆర్ఎస్ ప్రభుత్వ నిరంకుశత్వ పాలనకు చరమగీతం పాడాలని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నాయకులు నినాదాలు‌ చేశారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ కో ఆర్డినేటర్ రఘునందన్ రెడ్డి ఆధ్వర్యములో జరిగిన ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ సెక్రెటరీ సందీప్ రెడ్డి, మైనార్టీ వైస్ చైర్మన్ ఆయాజఖాన్, సీనియర్ నాయకులు జావేద్, అల్లావుద్దీన్, లింగంపల్లి మైనారిటీ చైర్మన్ జహంగీర్, సెక్రటరీ ఖాజా, అజీముద్దిన్, హారి, ఎన్ ఎస్ యూ ఐ నాయకులు చంద్రమౌళి, నవాజ్, ఆన్వర్ తది తరులు పాల్గొన్నారు.

గాంధీ విగ్రహానికి వినతి సమర్పిస్తున్న కాంగ్రెస్ నేతలు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here