ఎలక్ట్రిషియన్ కుటుంబానికి ఆర్థిక సహాయం

నమస్తే శేరిలింగంపల్లి: జనప్రియ ఫేస్ ఫైవ్ సెంట్రల్ కమిటీ ఎలక్ట్రీషియన్ శ్యామ్ అకాల మరణం చెందగా సెంట్రల్ కమిటీ గౌరవ అధ్యక్షుడు నల్లా సంజీవ రెడ్డి మృతుని‌ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. మృతుని కుటుంబానికి నల్లా సంజీవ రెడ్డి చేతుల మీదుగా రూ. 15 వేల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ కమిటీ ప్రధాన కార్యదర్శి వాసుదేవరావు, కమిటీ సభ్యులు రామకృష్ణ, సోమయాజులు, బస్తీ కమిటీ అధ్యక్షుడు నాగరాజు, ప్రధాన కార్యదర్శి రవికుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ సురేష్, సభ్యులు రామాంజనేయులు, చిన్న బాబు,రమేష్, లక్ష్మణ్ పాల్గొన్నారు.

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేస్తున్న జనప్రియ ఫేస్ 5 సెంట్రల్ కమిటీ గౌరవ అధ్యక్షుడు నల్లా సంజీవ రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here