నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ సగర సంఘం మహిళ విభాగం రాష్ట్ర అధ్యక్షురాలిగా పెద్ద బుద్ధి మహేశ్వరి సగర నియమితులయ్యారు. ఆదివారం గచ్చిబౌలి అంజయ్య నగర్ సగర సంఘం కార్యాలయంలో సగర రాష్ట్ర మహిళా సంఘం ఎన్నికలను నిర్వహించారు. సగర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ సగర అధ్యక్షతన జరిగిన ఎన్నికల సమావేశంలో రాష్ట్ర సగర మహిళ సంఘం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షురాలిగా మహేశ్వరి సగర (వనపర్తి జిల్లా), ప్రధాన కార్యదర్శిగా స్రవంతి సగర (వరంగల్ జిల్లా), కోశాధికారిగా పల్లవి సగర (హైదరాబాద్)ను నియమించారు. సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్యం సగర, రాష్ట్ర గౌరవాధ్యక్షులు హరికిషన్ సగర, రాష్ట్ర ఉపాధ్యక్షులు చిలుక సత్యం సగర, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సగర సంఘం మాజీ అధ్యక్షులు ఆర్. బి ఆంజనేయులు సగర, సీనియర్ నాయకులు సీత భద్రయ్య సగర, జిల్లా అధ్యక్షులు మోడల రవి సగర, ఆవుల భాస్కర్ సగర, మోడల తిరుపతయ్య సగర, నరసింహ సగర, మురళీకృష్ణ సగర, సురేష్ సగర, గ్రేటర్ ప్రధాన కార్యదర్శి వెంకట్రాములు సగర, కోశాధికారి రామస్వామి సగర, రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి చింతల బాలు సగర, మహిళా సంఘం మాజీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కుసుమ సగర తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర సగర సంఘం అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ సగర మాట్లాడుతూ తెలంగాణలో ఉన్న సగర జాతిని మొత్తం ఏకతాటిపైకి తీసుకురావడం కోసం మహిళలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా, మండల, గ్రామ స్థాయిలో కమిటీలు వేయాలని సూచించారు. భవిష్యత్తులో సగర జాతి ఏకతాటిపై రావడానికి మహిళలు కీలకపాత్ర పోషించాలని అన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని ఏకగ్రీవంగా తీర్మానాలు చేసింది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం పెద్ద మంగళారం గ్రామానికి చెందిన చింతల శ్యామల పాడిన ‘జయహో సగర జనసంద్రమై కదలరా’ అనే పాట సీడీని రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ సగర చేతుల మీదుగా ఆవిష్కరించారు.