మియాపూర్ నూతన సీఐ జయరాంకు కాంగ్రెస్ నేతల శుభాకాంక్షలు

శేరిలింగంప‌ల్లి, జూలై 19 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మియాపూర్ పోలీస్ స్టేషన్ నూతన సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సీఐ)గా బాధ్యతలు స్వీకరించిన జయరాంని శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు ఉప్పల ఏకాంత్ గౌడ్, ఉప్పల మహేష్ గౌడ్, విక్రమ్ గౌడ్, జితేందర్ కలిసి సీఐ జయరాంకు పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలిపారు. నూతన బాధ్యతల్లో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షిస్తూ తమ శుభాకాంక్షలు తెలియజేశారు. సీఐ జయరాం కూడా నాయకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణకు కట్టుబడి పనిచేస్తానని పేర్కొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here