గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డికి శుభాకాంక్షలు వెల్లువ

శేరిలింగంప‌ల్లి, ఫిబ్ర‌వి 11 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): గచ్చిబౌలి డివిజన్‌ను కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టి అభివృద్ధి పథంలో నడిపిస్తానని స్థానిక కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి పేర్కొన్నారు. గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్‌గా గెలిచి నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎన్టీఆర్ నగర్‌లోని కార్పొరేటర్ కార్యాలయంలో గచ్చిబౌలి డివిజన్‌కు చెందిన పలువురు సీనియర్ నాయకులు, యూత్ నాయకులు, మహిళా నాయకురాళ్లు, బీజేపీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు గంగాధర్ రెడ్డిని కలసి శాలువాతో సత్కరించి, బొకేలను అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత నాలుగేళ్లలో జీహెచ్ఏంసీ నుండి రూ.107 కోట్లతో, హెచ్‌ఎమ్‌డబ్ల్యూఎస్‌ నుండి రూ. 44 కోట్లతో అభివృద్ధి పనులు పూర్తి చేశామని, తాను గెలిచినప్పటి నుండి సిసి రోడ్లు, మురికి కాలువల నిర్మాణం, చెరువుల సుందరీకరణ, అంతర్గత రోడ్లు, పార్కుల అభివృద్ధి, మోడరన్ డ్రైనేజ్ వ్యవస్థల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. ఫ్లైఓవర్లు, రహదారి విస్త‌ర‌ణ ప‌నులు చేప‌ట్టాల‌మ‌ని, గచ్చిబౌలి జంక్షన్ వద్ద ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు కొత్త ఫ్లైఓవర్, రోడ్ విస్తరణ పనులు ప్రారంభించామ‌ని, నానక్ రామ్ గూడ – ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కనెక్టివిటీ మెరుగుపరిచేందుకు ప్రత్యేక రహదారి అభివృద్ధి చేశామ‌ని తెలిపారు.

స్మార్ట్ డివిజన్ గా అభివృద్ధి చేస్తున్నామ‌ని, స్మార్ట్ స్ట్రీట్ లైటింగ్, సిసి కెమెరాలు, రోడ్లపై సాంకేతిక ఆధారిత ట్రాఫిక్ నిర్వహణ వ్యవస్థ అమలు చేస్తున్నామ‌ని అన్నారు. ప్రజలు ఏ సమస్యలను తన దృష్టికి తీసుకువచ్చినా తక్షణమే అధికారులతో సమన్వయం చేసి పరిష్కారం కోసం కృషి చేస్తున్నామని గంగాధర్ రెడ్డి తెలిపారు. ప్రజలు నమ్మకంతో తనను గెలిపించినందుకు గంగాధర్ రెడ్డి కృతజ్ఞతలు తెలుపుతూ, గచ్చిబౌలి డివిజన్‌ను మరింత అభివృద్ధి చేసి, అత్యాధునిక సౌకర్యాలతో ఆదర్శవంతమైన డివిజన్‌గా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని రాష్ట్ర, జిల్లా, సీనియర్ నాయకులు, డివిజన్ నాయకులు, మహిళా నాయకురాలు, కార్యకర్తలు, కాలనీ అసోసియేషన్ ప్రతినిధులు, కాలనీ వాసులు, బస్తి వాసులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here