రేపు చందాన‌గ‌ర్‌లో అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాప‌న‌లు

చందాన‌గ‌ర్ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): చందాన‌గ‌ర్ డివిజ‌న్ ప‌రిధిలోని ప‌లు ప్రాంతాల్లో మంగ‌ళ‌వారం ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీ, కార్పొరేట‌ర్ బొబ్బ న‌వ‌త రెడ్డిలు శంకుస్థాప‌న‌లు చేయ‌నున్నారు. దీప్తి శ్రీ నగర్ లో రూ.138.50 లక్షల అంచనా వ్యయంతో చేబట్టబోయే స్ట్రామ్ వాటర్ డ్రైన్ (వరద నీటి కాలువ), సీసీ రోడ్డు నిర్మాణ పనుల‌కు, కైలాష్ నగర్, వేముకుంటలో రూ.32.60 లక్షల అంచనా వ్యయం తో చేపట్టబోయే సీసీ రోడ్డు, అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణ పనుల‌కు, ఫ్రెండ్స్ కాలనీ లో రూ.53.00 లక్షల అంచనా వ్యయంతో చేపట్టబోయే స్ట్రామ్ వాటర్ డ్రైన్ (వరద నీటి కాలువ) RCC NP3 (600 MM Dia) పైప్ లైన్ నిర్మాణ పనుల‌కు, తారానగర్ లో రూ.39.60 లక్షల అంచనా వ్యయంతో చేపట్టబోయే సీసీ రోడ్ల పునరుద్ధరణ నిర్మాణ పనుల‌కు, దీప్తి శ్రీ నగర్ లో రూ.70.80 లక్షల అంచనా వ్యయంతో చేబట్టబోయే సీసీ రోడ్డు నిర్మాణ పనుల‌కు, చందానగర్ భారత్ పెట్రోల్ బంక్ నుండి ఇంటి నంబర్ 5-80/2 వరకు రూ.16.90 లక్షల అంచనా వ్యయంతో చేబట్టబోయే సీసీ రోడ్ల పునరుద్ధరణ నిర్మాణ పనుల‌కు, చందానగర్ ఇంటి నంబర్ 5-80/2 నుండి ఇంటి నంబర్ 5-76/2 వరకు రూ.13.60 లక్షల అంచనా వ్యయంతో చేబట్టబోయే సీసీ రోడ్ల పునరుద్ధరణ నిర్మాణ పనుల‌కు, చందానగర్ రాయల్ మండి నుండి PRK హాస్పిటల్ వరకు రూ.28.40 లక్షల అంచనా వ్యయంతో చేబట్టబోయే సీసీ రోడ్ల పునరుద్ధరణ నిర్మాణ పనుల‌కు, అన్నపూర్ణ ఎన్‌క్లేవ్, గౌతమి నగర్ ల‌లో రూ.32.60 లక్షల అంచనా వ్యయంతో చేబట్టబోయే స్ట్రామ్ వాటర్ డ్రైన్ (వరద నీటి కాలువ) RCC NP3 (450 MM Dia) పైప్ లైన్, సీసీ రోడ్డు పునరుద్ధరణ నిర్మాణ పనుల‌కు, శంకర్ నగర్ , భవానిపురంలో రూ.23.60 లక్షల అంచనా వ్యయంతో చేబట్టబోయే సీసీ రోడ్లు, సీసీ రోడ్ల పునరుద్ధరణ నిర్మాణ పనుల‌కు, సిటిజెన్ కాలనీలో రూ.39.70 లక్షల అంచనా వ్యయంతో చేబట్టబోయే సీసీ రోడ్ల పునరుద్ధరణ నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేయడం జరుగుతుంద‌ని ప్ర‌భుత్వ విప్ ఆరెకపూడి గాంధీ క్యాంపు కార్యాలయం ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. మొత్తం రూ 4 కోట్ల 89 లక్షల 30 వేల వ్య‌యంతో చేపట్టనున్న ఆయా అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయ‌నున్నారు.

ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here