గచ్చిబౌలి (నమస్తే శేరిలింగంపల్లి): కాంగ్రెస్ పార్టీ శేరిలింగంపల్లి ఇన్చార్జ్ ఎం.రవికుమార్ యాదవ్ సోమవారం గచ్చిబౌలి ఇంద్రానగర్ లో పర్యటించారు. స్థానికంగా నెలకొన్న డ్రైనేజీ సమస్య తీవ్రతను ఇందిరా నగర్ వాసులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన రవికుమార్ యాదవ్ సంబంధిత అధికారులతో మాట్లాడారు. స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, మురుగు సమస్యను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎల్లేష్, స్థానికులు పాల్గొన్నారు.






