- ప్రారంభించిన మంత్రులు కేటీఆర్, మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి
- పాల్గొన్న డీజీపీ మహేందర్ రెడ్డి, మూడు కమిషనరేట్ల కమిషనర్లు
- భారీ తెరపై 5వేల సీసీ కెమెరాల దృశ్యాలను వీక్షించే వీలు
సైబరాబాద్ (నమస్తే శేరిలింగంపల్లి): గచ్చిబౌలిలో నూతనంగా ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ అండ్ డేటా సెంటర్‌ను రాష్ట్ర మంత్రులు కేటీఆర్, మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డిలు బుధవారం ప్రారంభించారు. సేఫ్ అండ్ స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్‌లో భాగంగా ఈ డేటా సెంటర్‌ను ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో మేయర్ బొంతు రామ్మోహన్, డీజీపీ మహేందర్ రెడ్డి, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లు, ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
కాగా ఈ సెంటర్లో భారీ తెరను ఏర్పాటు చేశారు. దీని మీద ఒకేసారి 5వేల సీసీ కెమెరాలకు చెందిన లైవ్ దృశ్యాలను వీక్షించవచ్చు. అలాగే 10 లక్షల సీసీ కెమెరాలకు చెందిన దృశ్యాలను నెల రోజుల పాటు స్టోర్ చేసేలా భారీ సర్వర్లను ఏర్పాటు చేశారు. అవసరం అయితే సర్వర్ల కెపాసిటీని పెంచనున్నారు. మొత్తం 14 మీటర్ల పొడవు, 42 మీటర్ల ఎత్తుతో అర్ధ చంద్రాకారంలో భారీ తెర ఉంటుంది. దాని పక్కనే 2 వైపులా 55 ఇంచుల డిస్ప్లేలు కలిగిన మరో 4 టీవీ తెరలను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలోని పలు చోట్ల ఉన్న సీసీ కెమెరాల దృశ్యాలను ఈ సెంటర్లోని భారీ తెరపై ఒకేసారి వీక్షించవచ్చు.
Ministers @mahmoodalitrs, @KTRTRS and @SabithaindraTRS inaugurated the Public Safety Integrated Operations Centre and Data Centre at Cyberabad Commissioner office in Gachibowli. pic.twitter.com/SHPA56BDne
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) November 11, 2020