కాలనీల్లోని సమస్యలను పరిష్కరించండి: విప్ గాంధీ కార్పొరేటర్లు, జిహెచ్ఎంసి అధికారులతో సమీక్షా

నమస్తే శేరిలింగంపల్లి: కాలనీలలో నెలకొన్న సమస్యలను ప్రథమ ప్రాధాన్యతగా పరిగణలోకి తీసుకుని, అలసత్వం ప్రదర్శించకుండా త్వరితగతిన పరిష్కరించాలని ప్రభుత్వ విప్ అరె కపూడి గాంధీ అన్నారు. మియాపూర్, చందానగర్ డివిజన్ల పరిధిలోని కాలనీలలోని సమస్యలు, చేపట్టవల్సిన అభివృద్ధి పనులపై మియాపూర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కార్పొరేటర్లు ఉప్పలపాటి శ్రీకాంత్ , మంజుల రఘునాథ్ రెడ్డి, GHMC ఇంజనీరింగ్ విభాగం అధికారులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు.

సమీక్షా సమావేశంలో కార్పొరేటర్లు, అధికారులతో మాట్లాడుతున్న విప్ గాంధీ

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ చేపట్టవలసిన అభివృద్ధి పనులలో వేగం పెంచాలని అలసత్వం ప్రదర్శిచకూడదన్నారు. పెండింగ్ రోడ్డు పనులు త్వరితగతిన పూర్తి చేయాలని, అవసరం ఉన్న చోట కొత్త ప్రతిపాదనలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజావసరాల దృష్ట్యా కాలనీ లలో వర్షాల వలన దెబ్బతిన్న రోడ్ల ను వెంటనే పునరుద్ధరించాలని, కాలనీ లలో త్వరితగతిన రోడ్ల ను వేయాలని అధికారులకు తెలిపారు. ప్రజలకు ఎల్లవేళలలో అందుబాటులో ఉండి, క్షేత్ర స్థాయిలో ప్రజా సమస్యలను పరిష్కరించే విధంగా పని చేయాలని, అన్ని కాలనీ లను సమగ్ర అభివృద్దే ధ్యేయంగా పని చేయాలని, కాలనీ లలో చేపడుతున్న పనులలో వేగం పెంచాలని,ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ విభాగం అధికారులు ఈ ఈ శ్రీకాంతిని, ఏఈ శివ ప్రసాద్, ఏ ఈ ప్రశాంత్ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here