శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు

శేరిలింగంపల్లి, న‌వంబ‌ర్ 9 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): రాష్ట్ర ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చుతూ, ప్రజా పాలనకు ప్రతీకగా నిలుస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని చందానగర్ డివిజన్ పరిధిలోని బస్ స్టాప్ వ‌ద్ద ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకల్లో ఎంబీసీ కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్ జెరిపేటి జైపాల్, నియోజకవర్గం నాయకులతో కలిసి టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి జగదీశ్వర్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జ‌గ‌దీశ్వ‌ర్ గౌడ్‌ మాట్లాడుతూ ప్రజాసేవలో నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ప్రజల ఆశీర్వాదాలతో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ, ప్రజల సంక్షేమం కోసమే పని చేస్తున్న రేవంత్ రెడ్డి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రతి అడుగు ముందుకు సాగాలని కోరారు. శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కంటెస్టెడ్ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, బ్లాక్ అధ్యక్షులు, డివిజన్ ఇన్చార్జులు, మైనారిటీలు, లేబర్ సెల్ నాయకులు, మహిళా కాంగ్రెస్ బ్లాక్ అధ్యక్షురాళ్లు, యువ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, ఎన్ ఎస్ యు ఐ నాయకులు, సేవాదళ్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here