శేరిలింగంపల్లి, ఆగస్టు 1 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని పలువురు వైద్య చికిత్స నిమిత్తం ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకోగా 51 మంది లబ్ధిదారులకు CMRF ద్వారా మంజూరైన రూ.30,67,000 ఆర్థిక సహాయానికి సంబంధించిన CMRF చెక్కులను కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు, సీనియర్ నాయకుడు రఘునాథ్ రెడ్డితో కలిసి బాధిత కుటుంబాలకి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ అందజేశారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి పేద ప్రజలకు గొప్ప వరం అని, ప్రజాక్షేమమే ప్రభుత్వ లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సంజీవ రెడ్డి, నాయినేనీ చంద్రకాంత్ రావు, పోతుల రాజేందర్ , MD ఇబ్రహీం, ఎల్లం నాయుడు, శ్రీధర్ రెడ్డి, రాంచందర్, భాస్కర్ రెడ్డి, వెంకటేశ్వర రావు, వెంకట్ నాయక్, పూర్ణ, వెంకటేష్, శ్రీకాంత్, యాసిన్ తదితరులు పాల్గొన్నారు.






