శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): వైద్య ఖర్చుల కోసం సీఎం రిలీఫ్ ఫండ్‌కు దరఖాస్తు చేసుకున్న పలువురు బాధితులకు ఆ ఫండ్ నుంచి మంజూరు అయిన సహాయాన్ని బుధవారం ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ, కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్‌లు అందజేశారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా పేదలకు సహాయం అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ తెరాస అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, తెరాస నాయకులు బ్రిక్ శ్రీను, తిరుపతి, శ్రీనివాస్ చౌదరి, సత్యనారాయణ పాల్గొన్నారు.






