శేరిలింగంపల్లి, డిసెంబర్ 5 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని కూకట్‌పల్లి డివిజన్ దీనబంధు కాలనీకి చెందిన బేగరి సరోజ, శివనగర్‌కు చెందిన తమ్మలి శ్రీనివాస్ ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకోగా వారికి మంజూరైన రూ.60వేలు, రూ.45వేల ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కులను సీఎంఆర్ఎఫ్ ద్వారా నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్ అందజేశారు. ఈ కార్యక్రమంలో గొట్టిముక్కల వెంకటేశ్వర రావు, దత్తులూరి అశోక్, మాచర్ల విష్ణు, రఘు గౌడ్, శంకర్ రావు, పరుశురాం, అరుణ్, రాహుల్ గైక్వాడ్ తదితరులు పాల్గొన్నారు.