శేరిలింగంపల్లి, డిసెంబర్ 25 (నమస్తే శేరిలింగంపల్లి): క్రిస్మస్ పండుగ సందర్భంగా PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ కార్యాలయంలో కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్, ఆల్విన్ కాలనీ డివిజన్ పాస్టర్లతో కలిసి క్రిస్మస్ కేక్ ను కట్ చేసి క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేవారు. ఈ సందర్బంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ శాంతి, నీతి, ప్రేమ, దయ కరుణ లతో ప్రపంచానికి కొత్త మార్గం నిర్దేశించిన క్రీస్తు జన్మదినం సందర్భంగా క్రిస్మస్ పర్వదినం ను పురస్కరించుకుని క్రైస్తవులకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను అని అన్నారు. అదేవిదంగా పండుగను భక్తి శ్రద్దలతో జరుపుకోవాలని , చాలా పవిత్రమైన పండుగ అని, పండుగ ను చక్కటి వాతావరణం లో శాంతి యుతంగా కుటుంబ సభ్యుల మధ్య ఆనందదాయకంగా , సంతోషకరంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకుడు దొడ్ల రామకృష్ణ గౌడ్, పాస్టర్లు తదితరులు పాల్గొన్నారు.






