శేరిలింగంపల్లి, డిసెంబర్ 25 (నమస్తే శేరిలింగంపల్లి): భారతదేశ మాజీ ప్రధాని అటల్ బిహారి వాజపేయి 101వ జయంతి సందర్భంగా కొత్తగా ఏర్పాటు అవబోతున్న మదీనాగూడ డివిజన్ హుడా కాలనీ సెంటర్ లో బీజేపీ డివిజన్ ప్రధాన కార్యదర్శి రాజు ముదిరాజ్ ఆధ్వర్యంలో బీజేవైఎం రాష్ట్ర నాయకుడు నందనం విష్ణు దత్త్ హుడా కాలనీ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన అల్పాహారం పంపిణీ కార్యక్రమంలో సుమారు 600 మంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యతిథులుగా బీజేపీ రాష్ట్ర నాయకుడు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి, సీనియర్ నాయకుడు మహేష్ యాదవ్, మాజీ కౌన్సిలర్ రమణయ్య, సత్యనారాయణ, పాలం శ్రీనివాస్, రాజు యాదవ్, వెంకటేష్ ముదిరాజ్, వినయ్, నర్సింహా యాదవ్, రామ్ మోహన్, శేఖర్, సురేష్ కురుమ, రామ్ చంద్ర యాదవ్, రామ్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, అనిల్, డివిజన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






