శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 2 (నమస్తే శేరిలింగంపల్లి): భారాస అధినేత, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ శేరిలింగంపల్లి యువ నాయకుడు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత చిర్రా రవీందర్ యాదవ్ సమావేశం అయ్యారు. సిట్ విచారణ అనంతరం నందినగర్ నివాసంలో కేసీఆర్ ను చిర్రా రవీందర్ యాదవ్ కలిశారు. శేరిలింగంపల్లిలోని తాజా రాజకీయ పరిణామాలను చిర్రా రవీందర్ యాదవ్ వివరించారు. ముందుగా చిర్రా రవీందర్ యాదవ్ గురించి స్వయంగా కేసీఆర్ కి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వివరించారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో చిర్రా రవీందర్ యాదవ్ చేస్తున్న పార్టీ కార్యక్రమాలను కేటీఆర్ అధినేత కేసీఆర్ కి తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ కార్యక్రమాలు బాగున్నాయని చిర్రా రవీందర్ యాదవ్ ను అధినేత కేసీఆర్ ప్రశంసించారు. తనతో పాటు సోఫాలో కూర్చోబెట్టుకొని చిర్రా రవీందర్ యాదవ్ ను రాజకీయ పరిణామాలు, పార్టీ కార్యక్రమాలు, శేరిలింగంపల్లిలోని పరిస్థితులను కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు.

పార్టీ బలోపేతంకు మరింత ప్రయత్నించాలని గులాబీ బాస్ కేసీఆర్, యువనాయకుడు చిర్రా రవీందర్ యాదవ్ కు సూచించారు. భవిష్యత్ లో సముచిత స్థానం కల్పిస్తామని కేసీఆర్, శేరిలింగంపల్లి యువనేత రవీందర్ యాదవ్ కు హామీ ఇచ్చారు. చిర్రా రవీందర్ యాదవ్ నిర్వహిస్తున్న కార్యక్రమాలపై కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. శేరిలింగంపల్లిలో భారాసను వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో గెలిపించాలని చిర్రా రవీందర్ యాదవ్ కు కేసీఆర్ తెలిపారు. అనంతరం చిర్రా రవీందర్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే ప్రతి ఎన్నికల్లో శేరిలింగంపల్లిలో గులాబీ జెండా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో అన్ని డివిజన్ లను కైవసం చేసుకుంటామని వెల్లడించారు.





