శేరిలింగంపల్లి, డిసెంబర్ 28 (నమస్తే శేరిలింగంపల్లి): భారాస అధినేత, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ను శేరిలింగంపల్లి యువనాయకుడు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత చిర్రా రవీందర్ యాదవ్ కలిశారు. హైదరాబాద్ లోని ఆయన నివాసంలో మార్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్ కి చిర్రా రవీందర్ యాదవ్ కృష్ణుడి ప్రతిమను అందజేశారు. చిర్రా రవీందర్ యాదవ్ యోగ, క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తున్న తీరు బాగుందని సీనియర్ నాయకుడు చిర్రా రవీందర్ పై కేసీఆర్ ప్రశంసలు కురిపించారు. పార్టీ కోసం శ్రమిస్తున్న తీరు పై కితాబు ఇచ్చారు. రానున్న ఎన్నికల్లో గట్టిగా పోరాడాలని సూచించారు. భవిష్యత్ లోనూ ఇలానే ముందుకు వెళ్లాలని చిర్రా రవీందర్ యాదవ్ కు కేసీఆర్ సూచించారని ఆయన తెలిపారు. అనంతరం చిర్రా రవీందర్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు మరోసారి కేసీఆర్ సీఎం కావాలని కోరుకుంటున్నారని వెల్లడించారు. రానున్న అన్ని ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గులాబీ జెండాను రెపరెపలాడిస్తామని చిర్రా రవీందర్ యాదవ్ పేర్కొన్నారు. శేరిలింగంపల్లిలోని అన్ని డివిజన్ లను గెలిపించుకుంటామని స్పష్టం చేశారు.






