చింతకింది రవీందర్ గౌడ్ నూతన గృహప్రవేశ కార్య‌క్ర‌మం

శేరిలింగంప‌ల్లి, ఏప్రిల్ 8 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి డివిజన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చింతకింది రవీందర్ గౌడ్ నూతన గృహప్రవేశ కార్య‌క్ర‌మాన్ని ఘనంగా నిర్వ‌హించారు. నెహ్రునగర్ లో బుధవారం జరిగిన ఈ వేడుకలో పిఎసి చైర్మన్, శేరిలింగంపల్లి శాసనసభ్యుడు ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని రవీందర్ గౌడ్, ప్రవళిక దంపతులను అభినందించారు. వారు భవిష్యత్తులో రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా మరెంతో ఎత్తుకు ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, స్థానిక నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here